Search This Blog

Thursday, 16 March 2023

తెలంగాణా లో అసిస్టెంట్జ ఇంజనీర్ పరీక్షరద్దు.కారణం.........

 పరీక్షా పేపరు లీక్ అవడం కారణంగా తెలంగాణా లో AE(అసిస్టెంట్ ఇంజనీర్) పరీక్షను రద్దు చేయడం జరిగింది. TSPSC( తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ) తదుపరి పరీక్షా  తేది మరియు సమయాన్ని త్వరలో ప్రకటిస్తామని TSPSC ప్రకటించింది. 

కాగా ఈ ఘటన వెనుక ప్రవీణ్, రేణుక, రాజశేఖర్ ప్రధాన నిందితులుగా గుర్తించారు.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ AE(అసిస్టెంట్ ఇంజనీర్) పరీక్ష పత్రాన్ని పెన్ డ్రైవ్ లో లోడ్ చేసి ప్రవీణ్ కు ఇవ్వగా , ప్రవీణ్ రేణుకకు దాన్ని 10 లక్షలకు అమ్మినట్లు కమిటి గుర్తించింది. రేణుక తమ్ముడు రాజేశ్వర్ కోసం రేణుక ఈ పని చేసినట్లు తెలిపింది. కాగా TTC చదివిన తన తమ్ముడు AE పరీక్షకు అర్హుడు కాడు అని తెలియగా అశోక్ నగర్ లో శిక్షణ తీసుకుంటున్న ఒక యువకుడికి పరీక్షా పత్రాన్ని 4 లక్షలకి బేరం పెట్టింది. ఆ యువకుడు అంత ఇచ్చుకోలేమని ఆమెకి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. యువకుడి ఫిర్యాదు అనంతరం పోలీసులు కేసు దర్యాప్తు చేతబట్టారు.

No comments:

Post a Comment

తాజా వార్తలు

బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్!! తమిళనాడులో మద్యం బందు. కారణం ఏంటో తెలిస్తే షాకింగ్ గానే ఉంటుంది మరి...

ఆంధ్రప్రదేశ్ నుండి కొనుగోలు చేస్తున్న మద్యంలో హానికరమైన సింథటిక్ కెమికల్స్ ఉన్నాయని తమిళనాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుండి మద్యం కొనుగోళ్లను ...

మీరు మెచ్చే వార్తలు